బాలీవుడ్ గ్రీక్ గాడ్ న్యూ రిలేషన్ షిప్ లో ఉన్నాడా!?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను అభిమానులు ప్రేమగా గ్రీక్ గాడ్ అనిపిలుచుకుంటారు. భార్య సుసానే ఖాన్ నుండి విడాకులు తీసుకున్న దగ్గర నుండి హృతిక్ రోషన్ సింగిల్ స్టేటస్సే మెయిన్ టైన్ చేస్తున్నాడు. దాంతో అందరి కళ్ళూ అతని మీదనే కొంతకాలంగా ఉంటున్నాయి. హృతిక్ బయట ఎక్కడ కనిపించినా, అతనితో ఎవరైనా మహిళలు ఉన్నారా అని మీడియా చూపులు సారిస్తూనే ఉంది. మొత్తానికి వారికి శుక్రవారం రాత్రి మంచి కంటెంట్ దొరికింది.
హృతిక్ రోషన్ ఓ రెస్టారెంట్ లోంచి ఓ మహిళ చేయి పట్టుకుని పార్కింగ్ దగ్గర ఉన్న తన కారు వరకూ తీసుకొచ్చి ఎక్కించాడు. అయితే వీరిద్దరి ముఖాలకూ మాస్క్ ఉండటంతో హృతిక్ ను చుట్టూ ఉన్న జనం పోల్చుకున్నారు కానీ ఆ అమ్మాయి ఎవరో వారికి అర్థం కాలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే సహజంగానే వైరల్ అయిపోయింది. దాంతో ఆ మహిళను గుర్తుపట్టే పనిలో నెటిజన్లు పడ్డారు. మొత్తానికి ఆమెను ఓటీటీ స్టార్ సబా అజాద్ గా వారు గుర్తించారు. 2011లో ‘ముఝ్ సే ఫ్రెండ్ షిప్ కరోగి’తో పాటు, గత యేడాది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఆంథాలజీ ‘ఫీల్స్ లైక్ ఇష్క్’లో సబా నటించింది. అలానే ఆమె నటించిన ‘రాకెట్ బాయ్స్’ సీరిస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది. సబా చేతిలో చెయ్యి వేసి హృతిక్ అంత కేరింగ్ గా కారు ఎక్కించాడంటే వీరద్దరి మధ్య సమ్ థింగ్ ఉన్నట్టేనని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోందని నెటిజన్స్ ఓ నిర్థారణకు వచ్చేశారు. తమ మీదే కెమెరాలన్నీ ఫోకస్ చేస్తున్నాయని తెలిసి కూడా హృతిక్ ఎలాంటి దాపరికం లేకుండా ఆమెతో పాటు కారు వరకూ వచ్చాడంటే… ఇందులో దాచాల్సింది ఏమీ లేదనే అభిప్రాయంలో అతను ఉండి ఉండొచ్చని మీడియా సరికొత్త అర్థాలు తీస్తోంది. మరి హృతిక్, సబా ఆజాద్ ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read
- PEDDI Press Meet : 'పెద్ది' షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
- Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
- Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
- Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
తాజావార్తలు
-
May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!