‘క్రిష్ 4’ లో హృతిక్ రోషన్ పాట!
‘క్రిష్’ చిత్రం విడుదలై పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యేడాది జూన్ 23న ‘క్రిష్ -4’ మూవీ గురించి అధికారిక ప్రకటన చేశాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ బిజీగా ఉన్నారు. ‘క్రిష్’ సీరిస్ చిత్రాలన్నింటికీ హృతిక్ పెదనాన్న రాజేష్ సంగీతం అందించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ‘క్రిష్ -4’కూ ఆయనే స్వర రచన చేస్తున్నారు. ఈ విశేషాలను రాజేష్ తెలియచేస్తూ, ”నా సోదరుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగానే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెడతాం. అలానే ఈ సినిమాలో ఓ పాటను ఖచ్చితంగా హృతిక్ రోషన్ తో పాడిస్తాం” అని చెప్పారు.
గతంలో హృతిక్ రెండు సినిమాలలో పాటలకు తన గొంతు కలిపాడు. అందులో ఒకటి ‘జిందగీ నా మిలేగీ దొబారా’ కాగా మరొకటి ‘కైట్స్’. సో… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తమ సొంత చిత్రంలో హృతిక్ పాట పాడబోతున్నాడు. కొత్తగా అందివచ్చిన సాంకేతికతో ‘క్రిష్ 4’ పాటలను వీనుల విందుగా అందిస్తానని రాజేశ్ హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ ప్రస్తుతం తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ లోనూ, దీపికా పదుకొనే ‘ఫైటర్’లోనూ నటిస్తున్నాడు.
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
తాజావార్తలు
-
Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..
-
Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
-
NDMA: నేడు మీ ఫోన్ తో పాటు లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకో తెలుసా?
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్‌లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!