గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తన భార్య సుహానా ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వారిద్దరూ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక హృతిక్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇటీవల హృతిక్ ఒక అమ్మాయితో కలిసి ముంబై వీధుల్లో కన్పించడం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. పైగా ఆమె చేతిని హృతిక్ పట్టుకోవడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పిక్స్ ను నెటిజన్లు ఇంకా మరువక ముందే మరోసారి ఈ జంట కెమెరాల కంటికి చిక్కారు.
Read Also : థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్
హృతిక్, సబా ఆజాద్ శుక్రవారం అర్థరాత్రి కొంత క్వాలిటీ టైంను స్పెండ్ చేశారు. బాంద్రాలోని ఒక కేఫ్ వెలుపల ఈ జంటను క్లిక్ చేశారు. వారు కేఫ్ నుండి బయటికి అడుగు పెట్టగానే హృతిక్, సబా తమ కారు వైపు చేయి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు. ఫోటోలలో హృతిక్ లేత గోధుమరంగు రంగు ప్యాంటుతో తెల్లటి టీని, దానిపై ఒక గళ్ల చొక్కా, నల్ల టోపీని కూడా ధరించాడు. మరోవైపు సబా స్వెట్ షర్ట్ ధరించి, నీలిరంగు డెనిమ్‌తో జత చేసింది. ఆమె జుట్టు సహాయంతో తన ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. హృతిక్, సబా పబ్లిక్ డొమైన్‌లో కనిపించడం ఇది రెండోసారి.