స్టైలిష్ గా ఉంటూనే సూపర్బ్ స్టంట్స్ ని చాలా ఈజీగా చేసే హృతిక్ రోషన్. గ్రీక్ గాడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మైంటైన్ చేసే హ్రితిక్… హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ రేంజులో ఉంటాడు. సరైన సినిమా పడితే టామ్ క్రూజ్ కన్నా హ్రితిక్ తక్కువేమి కాదు అని సినీ అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. వార్ సినిమాతో దాన్ని ప్రూవ్ చేసిన హ్రితిక్ ఇప్పుడు ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనవరి 25న రిలీజ్ కానున్న ఫైటర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియాలోనే అత్యధికంగా ఏరియల్ షాట్స్ ఉన్న సినిమాగా ఫైటర్ పేరు తెచ్చుకుంది. పఠాన్ మూవీని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ ని కూడా తెరకెక్కిస్తుండడంతో యాక్షన్ ఎపిసోడ్స్ ని కావాల్సినన్ని ఉంటాయి.
ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ ‘ఫైటర్ జెట్ పైలట్ ప్యాటీ’గా కనిపించనున్నాడు. దీపికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా హ్రితిక్ రోషన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. “స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా, నిక్ నేమ్ ప్యాటీ, డెసిగ్నేషన్: స్క్వాడ్రన్ పైలట్, యూనిట్: ఎయిర్ డ్రాగన్స్” అంటూ హ్రితిక్ క్యారెక్టర్ ని సంబంధించిన డేటాని తెలియజేస్తూ హ్రితిక్ పోస్టర్ ని వదిలారు. ఇందులో హ్రితిక్ రోషన్ షార్ప్ లుక్స్ తో ఫైట్ సిద్ధంగా ఉన్న వారియర్ లా ఉన్నాడు. హ్రితిక్ ఫ్యాన్స్ ని కంప్లీట్ గా ఖుషి చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ఫైటర్ టీజర్ రిలీజ్ కానుంది… ఈ మూవీతో హృతిక్ రోషన్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయడం గ్యారెంటీ.
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023