పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది ‘హరి హర వీరమల్లు’. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Exclusive : తమ్ముడు ఎఫెక్ట్.. ‘ఎల్లమ్మ’ నితిన్ తో డౌటే
ఇదిలా ఉండగా హరిహర విరామాలు సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తామని గతంలోనే ప్రకటించారు.ఈ నెల 24న ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతోంది. అయితే హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ కూడా షూటింగ్ చేసేసారట. అవును ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించే టైమ్ లోనే సెకండ్ పార్ట్ కు సంబందించి దాదాపు 20 నిమిషాల సినిమాను షూట్ చేసేసారట. ఈ విషయాన్నీ చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయన కొద్దీ రోజుల తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ ను స్టార్ట్ చేస్తారని తెలిపింది నిధి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో OGతో పాటు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. హరిహర పార్ట్ 1 సూపర్ హిట్ అయితే సీక్వేల్ ఉంటుంది లేదా ఉండకపోవచ్చు అనేది యూనిట్ సభ్యుల సమాచారం. సెన్సార్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యాడు హరిహర వీరమల్లు.