భార్య ఆరోపణలపై స్పందించిన హనీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండ్రోజులుగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు యో యో హనీ సింగ్ పై ఆయన భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తోంది. ఆయన భార్య షాలినీ తల్వార్ అతనిపై గృహ హింస కేసు పెట్టడమే కాకుండా పలు ఆరోపణలతో 10 కోట్లు డిమాండ్ చేయడం చర్చనీయంశంగా మారింది. తాజాగా హనీ సింగ్ ఆమె ఆరోపణలను ఖండిస్తూ సుదీర్ఘ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన భార్య చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆమె తమ కుటుంబం పరువు తీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని అన్నారు. “నేను గతంలో ఎప్పుడూ ప్రెస్ నోట్ జారీ చేయలేదు. చాలాసార్లు నా గురించి మీడియాలో తప్పుగా కవరేజ్ జరిగింది. అయినా కూడా నేను మాట్లాడలేదు. కానీ ఈసారి నా కుటుంబం గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.
Read Also : రాజ్ కుంద్రా కేసు : 8 గంటల పాటు షెర్లిన్ చోప్రా విచారణ
Also Read
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
- Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
నేను గత 15 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో పని చేస్తున్నాను. ఎంతోమంది స్టార్ హీరోలతో , మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేశాను. వాళ్లందరికీ నా భార్యతో నేను ఎలా ఉంటానో తెలుసు. గత దశాబ్ద కాలంగా నా భార్య కూడా నా సిబ్బందిలో ఒక భాగంగా ఉంటోంది. దీనితో పాటు ఆమె నాకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లు, షూటింగ్‌లు, మీటింగ్‌లలో నాతో పాటే వచ్చేది. ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. అందుకే దాని గురించి మాట్లాడనుకోవట్లేదు. ఈ దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సమయంలో అభిమానులు నా గురించి ఎలాంటి తప్పు తీర్మానాలు చేయకూడదని కోరుకుంటున్నాను. న్యాయం జరుగుతుందని, నిజం గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, సపోర్ట్ కు నేను కృతజ్ఞుడను” అంటూ హనీ సింగ్ ప్రెస్ నోట్ లో రాసుకొచ్చాడు.
తాజావార్తలు
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!