కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF ఫ్రాంచైజ్ ని అత్యంత భారి బడ్జట్ తో నిర్మించి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన హోంబలే ఫిల్మ్స్, లేటెస్ట్ గా కాంతార సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ అండ్ ట్రేడ్ వర్గాల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హోంబలే ఫిల్మ్స్ నుంచి ఏ సినిమా వచ్చినా అది పాన్ ఇండియా హిట్ అవుతుంది. ఈ నమ్మకాన్ని మరింత పెంచుతూ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యే లోపు మరో సినిమాని అనౌన్స్ చేశారు హోంబలే. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గ్రాండ్ సన్ అయిన ‘యువ రాజ్ కుమార్’ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ‘యువ’ అనే సినిమాని అనౌన్స్ చేసింది. పునీత్ రాజ్ కుమార్ కి సూపర్ హిట్స్, యష్ ని సూపర్ స్టార్ ని చేసిన రైటర్-డైరెక్టర్ సంతోష్ ఆనంద్ దర్శకత్వంలో ‘యువ’ సినిమా తెరకెక్కుతోంది.
రీసెంట్ గా ఒక వీడియోతో యువ రాజ్ కుమార్ ని ఇంట్రడ్యూస్ చేసిన మేకర్స్, ఆ వీడియోలోనే ‘యువ’ మూవీ టైటిల్ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో యువ రాజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. టైటిల్ టీజర్ కి అజ్నీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెమండస్ గా ఉంది. KGF ని తలపించేలా ఉన్న ‘యువ’ టైటిల్ టీజర్ మేకింగ్ అండ్ సౌండ్ డిజైన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజ్ కుమార్ ఫ్యామిలీ ఫాన్స్ అంతా యువ రాజ్ కుమార్ ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మేకర్స్ ఈరోజు ‘యువ’ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి యువ సినిమాతో యువ రాజ్ కుమార్ కి పాన్ ఇండియా రేంజ్ డెబ్యు దొరుకుతుందా? హోంబలే బ్రాండ్ వేల్యూతో రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి కొత్త స్టార్ హీరో పుట్టుకొస్తాడా అనేది చూడాలి.
ಯುವ ಚಿತ್ರೀಕರಣ ಆರಂಭ ♥️
𝑳𝒊𝒈𝒉𝒕𝒔, 𝑪𝒂𝒎𝒆𝒓𝒂, 𝑨𝒄𝒕𝒊𝒐𝒏 🎬
𝒀𝒖𝒗𝒂 𝒈𝒆𝒕𝒕𝒊𝒏𝒈 𝒓𝒆𝒂𝒅𝒚 𝒇𝒐𝒓 𝒚𝒐𝒖!#Yuva @santhoshAnand15 @yuva_rajkumar #VijayKiragandur @hombalefilms @HombaleGroup @gowda_sapthami @AJANEESHB @DopShreesha #VishwasKashyap @YuvaTheFilm pic.twitter.com/3DKOZX4eZb— Hombale Films (@hombalefilms) April 9, 2023