Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాంతారా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడ తగ్గకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ దీనిపై వినిపిస్తుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని మేకర్స్ రంగంలోకి దింపారట.
Also Read: Vettaiyan: భారీ ధరకు అమ్ముడుపోయిన సూపర్ స్టార్ మూవీ..
భారీ గ్రాఫిక్స్ హంగులతో ముస్తాబు కానున్న ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపినట్లు సమాచారం. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’, ‘ది లయన్ కింగ్’, ‘బాట్‌మ్యాన్’ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు యూఎస్, యూకేల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం రిషబ్ ఇప్పటికే కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: అరవింద్ కశ్యప్.