“హిట్” హిందీ రీమేక్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్” మూవీ. గత ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ నచ్చడంతో హిందీ మేకర్స్ దృష్టి “హిట్”పై పడింది. ఇంకేముంది తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు.
హిందీ రీమేక్ కు కూడా తెలుగు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారు. రాజ్ కుమార్ రావు సరసన సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతోంది. హిందీ రీమేక్ కు “హిట్ – ది ఫస్ట్ కేస్” అనే టైటిల్ ను ఖరారు చేశారు.
Also Read
Read Also : “లవ్ స్టోరీ” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
ఈ ఉదయం ముహూర్త వేడుకతో సినిమాను ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చిత్ర హీరో రాజ్‌కుమార్ రావు, దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను, నిర్మాతలు దిల్ రాజు, భూషణ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లాంఛనాలు పూర్తయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ముంబైలో ప్రారంభమవుతుంది. క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
కాగా తెలుగు చిత్రం “హిట్”లో విశ్వక్ సేన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ వెర్షన్‌ను టి-సిరీస్ భూషణ్ కుమార్, దిల్ రాజు, క్రిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!