“లవ్ స్టోరీ” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో “లవ్ స్టోరీ” ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా చై కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. “సెప్టెంబర్ 13 న ఉదయం 11:07 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ రేవంత్, మౌనిక #లవ్ స్టోరీ” అని ట్వీట్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న మాట.

Read Also : మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ

లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన “లవ్ స్టోరీ”లో శేఖర్ కమ్ముల సిగ్నేచర్ ఎమోషన్స్, రొమాన్స్‌, నిజమైన ప్రేమ కథలా హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. పవన్ సిహెచ్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా “సారంగ దరియా” పాట చార్ట్ బస్టర్. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోవడానికి పాటలు కూడా ముఖ్య కారణం. అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Related Articles

Latest Articles

-Advertisement-