సీనియర్ స్టార్ హీరో, హయ్యెస్ట్ హిట్ పర్సెంటేజ్ ఉన్న హీరో దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో వెంకటేష్, బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో ‘హిట్’ హీరోయిన్ నటిస్తుంది అంటూ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. చి.లా.సౌ, హిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రుహాని శర్మ సైంధవ్ సినిమాలో ‘డాక్టర్ రేణు’గా నటిస్తోంది. రుహాని శర్మ పాత్రకి సంబంధించిన పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. సైంధవ్ సినిమాలో జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది, ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ గతంలోనే వచ్చింది.
Read Also: Naresh Pavithra: నరేష్ కాపురంలో నిప్పులు పోసిన పవిత్ర…
వెంకటేష్ 75వ సినిమాగా బయటకి రానున్న ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను సైంధవ్ సినిమాలో వెంకీ మామని, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ రేంజులో చూపిస్తున్నట్లు ఉన్నాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీ నుంచి ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం నవాజుద్దిన్ సిద్దికీని తీసుకున్నారు. డిసెంబర్ 22న సైంధవ్ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి గత కొన్ని రోజులుగా ఫ్యామిలీ, ఫన్ సినిమాలనే ఎక్కువగా చేస్తున్న వెంకటేష్ సైంధవ్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Welcome to the team! @iRuhaniSharma#SAINDHAV #SaindhavOnDec22 @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/YQT0WidpFE
— Venkatesh Daggubati (@VenkyMama) April 21, 2023