Naresh Pavithra: నరేష్ కాపురంలో నిప్పులు పోసిన పవిత్ర…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. నరేష్ హోమ్ బ్యానర్ అయిన ‘విజయకృష్ణ మూవీస్’ తెలుగు ఆడియన్స్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ఇచ్చింది. ఈ బ్యానర్ లోనే ‘మళ్లీ పెళ్లి’ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లు కూడా రిలీజ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా మళ్లీ పెళ్లి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది, ఇది సినిమా కథలా కాకుండా నరేష్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసిన బయోపిక్ లా కనిపించడం విశేషం.
నరేష్, అతని భార్య రమ్యల మధ్యలో పవిత్ర ఎలా వచ్చింది? అసలు రమ్య ఈ విషయంలో ఎలా ఫీల్ అవుతుంది? నరేష్, రమ్య ఆరోపణలకి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే మళ్లీ పెళ్లి తెరకెక్కినట్లు ఉంది. సినిమాలో ఆర్టిస్టుల పేర్లు కూడా ఒరిజినల్ నేమ్స్ పెట్టడంతో టీజర్ మరింత రియలిస్టిక్ గా ఉంది. నరేష్, పవిత్ర హోటల్ లో దొరికిన ఎపిసోడ్ ని కూడా టీజర్ లో చూపించారు. “మా ఇద్దరి కాపురంలో పవిత్ర లోకేష్ నిప్పులు పోసింది” అనే డైలాగ్ టీజర్ లో బాగా పేలింది. ఓవరాల్ గా హగ్స్, కిస్ లు, థ్రిల్స్ తో మళ్లీ పెళ్లి టీజర్ ఆకట్టుకుంది. నరేష్ వైఫ్ రమ్య పాత్రలో నటుడు విజయ్ కుమార్ కూతురు ‘వనితా విజయ్ కుమార్’ నటించింది. మరి ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రానున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ తో పాటు శరత్ బాబు, జయసుధ, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, అన్నపూర్ణ, ప్రవీణ్ యెండమూరి తదితరులు నటిస్తున్నారు.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
తాజావార్తలు
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!