యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తు నిర్మిస్తున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూడబోతున్నామని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో తెలిసింది.
కాగా ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుంది. సినిమాలో కాస్త వైలెన్స్, అలాగే హింసతో పాటు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు కొన్ని హింసాపాళ్లు ఎక్కువగా ఉన్న సీన్స్ ను తొలగించారట. అలాగే ఈ సినిమాకు A సర్టిఫికెట్ ను జారీ చేసారు సెన్సార్ టీమ్. మొత్తంగా రెండు గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ఫెయిల్ కాపీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సారి నేచురల్ స్టార్ నుండి ఆడియెన్స్ షాక్ అయ్యే సినిమా వస్తదని సిల్వర్ స్క్రీన్ ఎరుపెక్కుతుందని సమాచారం. ఈ నెల 14న రాబోతున్న HIT 3 థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచనుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతున్న హిట్ 3 రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.