‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని వచ్చి అడివి శేష్ మరో హిట్ కొట్టాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వారల పాటు థియేటర్స్ లో ఆడింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి లాంగ్ రన్ దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలుసు, ఒక్క రోజే మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యే అంత బిజీ షెడ్యూల్ లో ‘హిట్ 2′ మూవీ ఫోర్ వీక్స్ సక్సస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అయ్యింది. ఈ మూవీ తెలుగు రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా శేష్ మీడియాతో మాట్లాడుతూ… “హిట్ 2 సినిమాని హిందీలో రిలీజ్ చేయమని చాలా మంది అడుగుతున్నారు, హిట్ 2ని కేవలం తెలుగు వరకే అనుకోని రుపొందించాం. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి హిందీలో కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి నానితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఈసారి పెద్దగా చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
అడివి శేష్ చెప్పినట్లుగానే ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక్కడ మార్నింగ్ షోతోనే హిట్ టాక్, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ‘హిట్ 2’ మూవీ హిందీలో రిలీజ్ అయ్యింది అనే విషయం కూడా ఎక్కువ మందికి తెలియదు, రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతున్నా ‘వర్డ్ ఆఫ్ మౌత్’ ఎక్కడా వినిపించట్లేదు. తెలుగులో బ్రేక్ మార్క్ రీచ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ తెచ్చిన ఒక సినిమాని హిందీలో రిలీజ్ చేసే సమయంలో చెయ్యాల్సిన మినిమమ్ ప్రమోషన్స్ ని కూడా చెయ్యకపోవడమే హిందీలో ‘హిట్ 2’ సైలెన్స్ కి కారణంగా కనిపిస్తోంది. తెలుగులో చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసిన అడివి శేష్, మీనాక్షీ చౌదరి, సైలెష్ కొలను హిందీ రిలీజ్ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇంత సైలెంట్ అవ్వాలి అనుకోని ఉంటే ‘హిట్ 2’ని హిందీలో రిలీజ్ చెయ్యకుండా, డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేసి ఉండాల్సింది. ఏది చేసినా గట్టిగా చెయ్యాలి అని చెప్పే అడివి శేష్, హిట్ 2 హిందీ రిలీజ్ విషయంలో గట్టిగా కాదు కదా బేసిక్ ఎఫోర్ట్స్ కూడా పెట్టలేదు. ఇది తన నార్త్ మార్కెట్ కే ప్రమాదం కలిగించే విషయం అని అడివి శేష్ గుర్తిస్తే ఇక ఇలాంటివి జరగకుండా ఉంటాయి.