Allari Naresh: హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఉగ్రం’: విజయ్ కనకమేడల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ugram: ‘నాంది’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీ మే 5న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ‘ఉగ్రం’ విశేషాలను విజయ్ కనకమేడల తెలిపారు. ‘ఉగ్రం’ మొదలైన విధానాన్ని చెబుతూ, “‘నాంది’ మొదటి షెడ్యుల్ అయిన తర్వాత లాక్ డౌన్ వచ్చింది. ఆరు నెలలు ఖాళీగా కూర్చున్న సమయంలో ‘ఉగ్రం’ కథ చేసుకున్నాను. ఈ కథ నరేష్ గారికి అయితే బావుంటుందని పించింది. ఆయన ఎమోషన్స్ చేశారు కానీ పూర్తి రౌద్ర రసంతో చేయలేదు. ఇది ఆయనకి కొత్తగా ఉంటుందనిపించింది. ఆయనకి కథ చెబితే నచ్చింది. తర్వాత కథపై ఆరు నెలలు పరిశోధన చేశాం. నరేష్ గారి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తర్వాత ఉగ్రం మొదలు పెట్టడం జరిగింది. కథ గురించి చెప్పాలంటే… నిత్యం మిస్సింగ్ వార్తలు మీడియాలో కనిపిస్తూనే వున్నాయి. తెలంగాణ హైకోర్టు కూడా మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్మెంట్ ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. ఈ అంశంపై, తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల్లో బాధ ఎలా వుంటుందనే దానిపై కథ చేస్తే బావుంటుదనిపించింది. ఈ కథను అందించిన తూము వెంకట్ నేను మంచి స్నేహితులం. ఇండిపెండెంట్ గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత తనది కథ, నాది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ క్రెడిట్స్ అనుకున్నాం. మా కో-ఆర్డినేషన్ చాలా బావుంటుంది. అంతకు ముందు హరీష్ శంకర్ గారి దగ్గర పని చేశాం” అని అన్నారు.
హీరో హీరోయిన్ పాత్రల గురించి చెబుతూ, “ఇందులో ‘నాంది’ కంటే ఎక్కువ ఎమోషన్స్, మాస్, ఇంటెన్స్ వుంటుంది. ఒక పోలీస్ అధికారి పాత్ర తీసుకున్నాం కాబట్టి యాక్షన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ‘ఉగ్రం’ మంచి యాక్షన్ థ్రిల్లర్. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వుంటాయి. కథ చెప్పినప్పుడే అందులో సీరియస్ నెస్ నరేశ్ గారికి అర్ధమైపోయింది. ఆయన గెటప్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో క్లారిటీ వచ్చింది. దీనికి సిక్స్ ప్యాక్ బాడీ పెంచాల్సిన అవసరం లేదు. అయితే స్టిఫ్ గా ఉండటానికి కొన్ని వర్క్ అవుట్స్ చేయడం, కాన్ఫిడెంట్ గా మాట్లాడటం ఇవన్నీ షూటింగ్ కి ముందే చర్చించుకున్నాం. ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే ముందే రిహార్సల్స్ చేశాం. యాక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. అలానే హీరోయిన్ మిర్నా మీనన్ గత చిత్రాలను నేను చూశాను. హీరోయిన్ కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. ఆడిషన్స్ కి పిలిచి సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాన్ని ఇచ్చి నటించమని చెప్పాం. తను చాలా చక్కగా చేసింది. ఆ పాత్రకు సరైన ఎంపిక అని భావించి ఆమెను సెలక్ట్ చేశాం” అని అన్నారు.
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
తను రెండు సినిమాల గురించి తెలియచేస్తూ, “‘నాంది, ఉగ్రం”కు సంబంధం లేదు. ఆ కథ ప్రజంటేషన్ వేరు. ‘ఉగ్రం’ ప్రజంటేషన్ వేరు. అది కోర్టు రూమ్ డ్రామా. ఇది యాక్షన్ థ్రిల్లర్.. స్పీడ్ గా పరిగెడుతుంది. ఏదైనా స్క్రిప్ట్ ప్రకారమే వుంటుంది. వ్యక్తిగతంగా కథలో హీరో సెంట్రిక్ గా వుండే సినిమాలు చేయడానికి నేను ఇష్టపడతాను. ఇందులో మొత్తం మూడు పాటలుంటాయి. లవ్, ఫ్యామిలీ, టైటిల్ సాంగ్. ఈ మూడు పాటలు కూడా కథలో భాగంగానే వుంటాయి. ఇక ఈ సినిమా నిర్మాతల గురించి ఎంత చెప్పినా తక్కువే. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా క్యాలిటీ కోసం చాలా సపోర్ట్ చేశారు. బాగా ఖర్చు పెట్టారు, బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ నుంచి ఇప్పటి వరకూ చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కి ఆర్గానిక్ గా దాదాపు 6 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల్లో అంచనాలు వున్నాయి. ఆ అంచనాలని అందుకుంటాం. థియేటర్ లో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుంటాయి” అని అన్నారు. తన దగ్గర కొన్ని కథలు ఉన్నాయని, ప్రస్తుతం నాగచైతన్య కోసం ఓ కథను తయారు చేస్తున్నానని విజయ్ కనకమేడల చెప్పారు.
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!