మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హే సినామిక. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బృంద డైరెక్టర్ గా మారబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఆర్జే గా పనిచేసే ఆర్యన్ కి మౌన(అదితి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి పెళ్ళికి దారి తీస్తుంది. పెళ్లి తరువాత ప్రతి గొడవలోను ఆర్యన్ సర్దుకుపోతుంటాడు. అది మౌన కు నచ్చదు. ఎలా అయినా ఆర్యన్ ని వదిలించుకోవాలి అని అనుకున్న టైమ్ లో అతడి లైఫ్ లోకి కాజల్ ప్రవేశిస్తుంది. వీరిద్దరూ చనువుగా ఉండడం చుసిన మౌన తన భర్త తనకే కావాలని కాజల్ తో యుద్దానికి దిగుతుంది.
ఇక చివరికి మౌన చెప్పినవి చేసినవి అన్ని అబద్దాలే అని చెప్పడం ఆసక్తిగా మారింది. మరి భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన కాజల్ ఎవరు..? చివరికి ఆర్యన్, మౌన కలిసారా..? అనేది కథాంశంగా తెలుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు అడ్డం పెట్టె కథగా ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. భార్యాభర్తలు విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా కలిసి ఉంచేది ప్రేమ ఒక్కటే అని చెప్పి సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేశారు. మౌన, ఆర్యన్ లా దుల్కర్, అదితి జంట ఆకట్టుకున్నారు. వారిద్దరి ఆమధ్య కెమిస్ట్రీ ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఇక కాజల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రతీ ఫ్రేమ్ ఓ అందమైన ప్రేమ దృశ్యకావ్యాన్ని తలపించేలా వుంది. రిచ్ లొకేషన్స్, టెక్నాలజీ వాల్యూస్ అదిరిపోయాయి. మార్చి 3 న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.