Site icon NTV Telugu

Priya bhavani: అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి..

February 7 2025 02 24t125949.902

February 7 2025 02 24t125949.902

‘పుష్ప 2 : ది రూల్’ తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పటికే ఆయనకు అని చోట్ల మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. ‘పుష్ప’ సిరీస్ లతో నార్త్ లో మరింత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అతని కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఇలాంటి పవర్ ఫుల్ హీరో తో జత కట్టాలని ఏ హీరోయిన్ కి మాత్రం ఉండదు చెప్పండి. ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ ఎంతో మంది హీరోయిన్లు ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు.  ఇక అలాంటి వారిలో నటి ప్రియా భవానీ శంకర్ ఒకరు.

Also Read: Malavika Mohanan: ‘రాజా సాబ్’ తో నా కల నెరవేరింది:మాళవిక మోహనన్

క్యరెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి తన ట్యాలెంట్ తో అందంతో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టెసింది ప్రియా భవానీ. ప్రజంట్ అటు తమిళ చిత్రాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఆడియన్స్ లో మరింత పేరు సంపాదించుకుంటుంది. ‘కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తొలి సినిమాతోనే ఆడియెన్స్‌ను తన అందంతో కట్టి పడేసింది. ఆ తర్వాత గోపీచంద్ తో ‘భీమా’, సత్యదేవ్ ‘జీబ్రా’ చేయగా. ఇప్పుడు తమిళంలో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. చివరిగా ‘ఇండియన్ 2’, ‘డిమోంటీ కాలనీ 2’, ‘బ్లాక్’, ‘జీబ్రా’ వంటి చిత్రాలతో అలరించిన భవాని.. ప్రస్తుతం ‘ఇండియన్ 3’లో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ‘ అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి. ఆయనతో బిగ్ స్క్రీన్ పై నటించాలని ఉంది. రొమాంటిక్ సీన్ లోనైనా పర్వాలేదు నటించేస్తా’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version