కేరళ కుట్టి మాళవిక మోహనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘వేట’ మూవీతో సినిమా రంగంలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. తన రెండో సినిమాతోనే దళపతి విజయ్‌తో నటించే అద్భుతమైన అవకాశం కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ మూవీలో చారు పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దీంతర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టిన మాళవిక అక్కడ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో కార్తీ ‘సర్దార్’ సినిమా తో పాటు ‘మిత్రన్’ అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవ్వని ఒకెత్తు అయితే తెలుగులో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాజా సాబ్’ సినిమాలో కూడా నటిస్తుంది మాలవిక. కామెడీ, హారర్ జోనర్‌లో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి అలాగే ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది మాళవిక..
Also Read: Dragon: ‘డ్రాగన్’ మూవీ పై ప్రశంసలు కురిపించిన దర్శకుడు శంకర్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. ‘ ‘బాహుబలి’ మూవీ నుంచి ప్రభాస్‌కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో కలిసి నటించాలి అని ఎన్నో కలలు కన్నా. మొత్తానికి ‘రాజా సాబ్’ మూవీతో నా కల నెరవేరింది. ఇక సెట్‌లో ప్రబాస్‌ని చూసి ఆశ్చర్యపోయా. అంతపెద్ద స్టార్ అయిన చాలా నార్మల్‌గా ఉంటాడు.. సపోర్ట్ చేస్తారు. ఆయన చూట్టు ఉన్న వారితో ఎంతో సరదాగా ఉంటూ ఆ ప్రదేశాన్నంతా కంఫర్టబుల్‌గా మార్చేస్తారు. ముఖ్యంగా సెట్‌లో ఉన్న టీమ్ మొత్తానికీ మంచి ఫుడ్‌ని పంపిస్తారు. దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు.. మంచి కామెడీ టైమింగ్‌తో నవ్విస్తారు. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది మాళవిక మోహనన్.