ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన శివపుత్రుడు లో లైలా నటన ఇప్పటికీ ఎక్కడో ఒక చోట నవ్వులు పూయిస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహమాడి సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీ అవకాశాల కోసం ఎదురుచుస్తున్నదట.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం లైలా.. కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందట. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన గెటప్పులో కనిపించనున్నాడు. ఒకటి యంగ్ పోలీసాఫీర్ పాత్ర అయితే.. మరొకటి 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర.. ఎంతో ఛాలెంజిగ్ గా కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లైలా ఒక కీలక పాత్రలో నటిస్తుందని, ఈ సినిమాతో అమ్మడికి మంచి పేరు వస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా అన్నతో హిట్ అందుకున్న ఈ భామ .. ఇప్పుడు తమ్ముడితో రీ ఎంట్రీ ఇవ్వడం కొద్దిగా ఆశ్చర్యమే.. మరి ఈ అవకాశం తో లైలా తెలుగులోనూ బిజీగా మారుతుందేమో చూడాలి.
