మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ ని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్, ధమ్కీ మూవీ ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు. ఇటివలే బయటకి వచ్చిన ‘ఆల్మోస్ట్ పడి పోయిందే పిల్లా’ సాంగ్ కూడా ఇన్స్టాంట్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 17కి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో విశ్వక్ సేన్ అభిమానులు ధమ్కీ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త ప్రకారం ధమ్కీ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వట్లేదట. ఆ డేట్ ని కాకుండా కొన్ని రోజులు వెనక్కి ధమ్కీ సినిమాని పుష్ చేయన్నున్నారు అనే రూమర్ నెట్ లో వైరల్ అవుతోంది. ధమ్కీ వాయిదా పడడానికి సమంతా నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమానే కారణం అంటున్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన శాకుంతలం సినిమా కూడా ఫిబ్రవరి 17నే రిలీజ్ కానుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శాకుంతలం సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఇదే డేట్ ని గీత ఆర్ట్స్ నుంచి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కూడా రిలీజ్ కానుంది. హాలీవుడ్ నుంచి మార్వెల్ మూవీ ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా’ కూడా ఫిబ్రవరి 17న షెడ్యూల్ అయ్యి ఉంది. ఈ మార్వెల్ సినిమా దెబ్బకి ఇండియాలో ‘A’ సెంటర్స్ లాక్ అవుతాయి. సమంతా ఇమేజ్ కి దృష్టిలో పెట్టుకోని చూస్తే దిల్ రాజు ‘శాకుంతలం’ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడికే సిట్యువేషన్ టైట్ అవుతుంది అంటే ధనుష్ తన బైలింగ్వల్ సినిమా ‘సార్’తో ఫిబ్రవరి 17నే ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇలాంటి సమయంలో థియేటర్స్ లేకుండా పాన్ ఇండియా రిలీజ్ వెళ్లడం కరెక్ట్ కాదు అనే ఆలోచనతోనే విశ్వక్ సేన్ ధమ్కీ సినిమాని వాయిదా వేసే ఆలోచన చేస్తున్నాడట. మరో సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త నిజమవుతుందో లేదో చూడాలి. మరోవైపు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాని కూడా గీత ఆర్ట్స్ వాయిదా వేస్తుంది అంటున్నారు, ఈ విషయంలో కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.