‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలతో కాస్త నిరాశపరచిన మాస్ మహారాజ రవితేజ ఈసారి ఎలా అయిన హిట్ కొట్టాలని చేస్తున్న సినిమా ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రవితేజ తన ట్రేడ్ మార్క్ ఎనేర్జితో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇప్పటికే ధమాకా నుంచి బయటకి వచ్చిన సాంగ్స్ మరియు టీజర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని రాబట్టాయి. దీంతో ధమాకా మూవీతో కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకం అందరిలోనూ కలిగింది. రవితేజలోని కామెడీ టైమింగ్ ని మరోసారి చూడబోతున్నామని ఆయన ఫాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక ట్రైలర్ కూడా రిలీజ్ చేసి హైప్ ని పెంచడమే చిత్ర యూనిట్ చేయాల్సిన పని. డిసెంబర్ 23న రిలీజ్ అవనున్న ధమాకా మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
ధమాకా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ని మంచి స్వింగ్ లో చేస్తున్నాయి. ఇందులో భాగంగా రవితేజ, డాన్స్ రియాలిటీ షో ‘ఢీ‘ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. డిసెంబర్ మూడున టెలికాస్ట్ అవ్వనున్న ఈ ఎపిసోడ్ ప్రోమో బయటకి వచ్చింది. రవితేజ ఎనర్జీ ఏంటో ఈ ప్రోమోలో కనిపించింది, ఆయన వేసిన పంచులు కూడా చాలా బాగున్నాయి. హైపర్ ఆదిని, అసలు నీకు డాన్స్ ప్రోగ్రామ్ కి సంబంధం ఏంటని రవితేజ అడగడంతో అక్కడ ఉన్న అందరూ నవ్వేశారు. కృష్ణ సినిమాలోని డైలాగ్ చెప్పి, అయినా అది మన క్యారెక్టర్ కాదుగా గెస్ట్ గా వచ్చాం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పిన రవితేజ, ఢీ స్టేజ్ పైన డాన్స్ కూడా వేశాడు. రవితేజ సినిమాల్లో ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు కానీ ప్రమోషన్స్ లో అంత జోష్ చూపించడు. సినిమా చేశామా, నాలుగు ఇంటర్వూస్ ఇచ్చామా, ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడామా అంతే ఇక మూవీ ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయాయి అన్నట్లు ఉండడం రవితేజ అలవాటైన పని. మాస్ మహారాజ ఫాన్స్ కూడా ఈ విషయంలో అప్పుడప్పుడూ ఈ విషయంలో నిరాశ చెందుతూ ఉంటారు. ఈసారి మాత్రం ఎలాంటి లోటు లేకుండా రవితేజ ధమాకా ప్రమోషన్స్ ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇదే జోష్ ని సినిమా రిలీజ్ వరకూ మైంటైన్ చేస్తే, రవితేజ మంచి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం.