Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక్కో సినిమాను డిఫ్రెంట్ జానర్ లో చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్వయంభు. హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్నా ఈ సినిమా కోసం సరికొత్త లుక్ చేంజ్ అవుతూ, యుద్ద విద్యలు వంటివాటిపై కఠోర శిక్షణ తీసుకున్నాడు. నిన్నతన బర్త్ డే సందర్భంగా ‘స్వయంభూ’ చిత్రం నుండి మేకర్స్ ఒక పవర్ఫుల్ అప్డేట్ను విడుదల చేశారు.
Also Read
స్వయంభులోని ‘కృష్ణన్ రామన్’ పాత్ర కోసం నిఖిల్ తీసుకున్న శిక్షణ, డెడికేషన్ ను వీడియో రూపంలో రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పాత్ర కోసం నిఖిల్ ప్రాణం పెట్టి పనిచేశారని చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘ట్రాన్స్ఫర్మేషన్ గ్లింప్స్’ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. కృష్ణన్ రామన్ పాత్రలో ఒదిగిపోవడానికి నిఖిల్ ఏకంగా 45 రోజుల పాటు నిఖిల్ కత్తిసాము, కర్రసాము, మార్షల్ ఆర్ట్స్ మరియు విలువిద్య వంటి పురాతన యుద్ధ విద్యలను నేర్చుకుంటూ కనిపించారు. ఈ శిక్షణ సమయంలో పలుమార్లు గాయపడినా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా శ్రమించాడు. సినిమా కోసం నిఖిల్ ఆఫ్‌స్క్రీన్‌లో చూపించిన డెడికేషన్ ఆన్‌స్క్రీన్‌పై పవర్ఫుల్ వారియర్ లుక్‌లో కనిపించింది. నిఖిల్ లుక్ కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయి లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. నభ నటేష్, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోందని త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!