NTV Telugu Site icon

Writer Padmabhushan: ఆ విజయం దీనికి రాసి పెట్టి ఉంది: నాని

Nani

Nani

Nani: సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్‌’. ఇటీవల చిన్న చిత్రంగా విడుదలైన ఇది పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే మహేశ్ బాబు, శివరాజ్ కుమార్, రవితేజ, రష్మిక మందణ్ణ తదితరులు చిత్ర యూనిట్ ను అభినందించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా వీరికి తన శుభాకాంక్షలు తెలియచేశాడు.

Read Also:Prithvi Shaw : సెల్ఫీ కోసం గొడవ.. క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి!

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ”సుహాస్ నా ఫేవరేట్ యాక్టర్. ఈ విషయం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. స్క్రీన్ మీద వుంటే తన పెర్ ఫార్మెన్స్ అలా చూస్తూ వెళ్లిపోవచ్చు. ‘రైటర్ పద్మ భూషణ్’ సినిమా ఎంతో గొప్పగా ఆడుతోంది. ఎంతోమంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. న్యూ ఏజ్ సినిమాకి సపోర్ట్ చేస్తున్న టీం అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సుహాస్ కి అభినందనలు. ‘కలర్ ఫోటో’ కూడా థియేటర్ లో వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యిండేది.

కానీ అది ‘రైటర్ పద్మభూషణ్’కి రాసి పెట్టినట్లు ఉంది. శరత్, అనురాగ్… నేను ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి సినిమాలు తీయాలని వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేశానో.. తెలుగులో అలాంటి సినిమాలని, ఆలోచనలని, అలాంటి ప్రతిభని సక్సెస్ ఫుల్ గా ప్రోత్సహిస్తున్న మరో ప్రొడక్షన్ హౌస్ చాయ్ బిస్కెట్. ఈ టీంకు, చంద్రు గారికి కూడా కంగ్రాట్స్. దర్శకుడు ప్రశాంత్ కి అభినందనలు. ఎవరైనా ఇంకా చూడకపోయివుంటే వెంటనే చూసేయండి” అని కోరారు. ‘రైటర్ పద్మభూషణ్‌’ పది రోజుల్లో పది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రస్తుతం అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమౌతోంది.

Read Also: Bajaj Chetak: మరింత ఎక్కువ రేంజ్‌తో బజాజ్ చెతక్ ఈ-స్కూటర్..108కి.మీ మైలేజ్‌!