Bajaj Chetak: మరింత ఎక్కువ రేంజ్‌తో బజాజ్ చెతక్ ఈ-స్కూటర్..108కి.మీ మైలేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ నుంచి చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు త్వరలోనే అప్‍డేటెడ్ వెర్షన్ రానుంది. కొత్త వెర్షన్-2023 చెతక్ స్కూటర్ మరింత ఎక్కువ రేంజ్‍ను ఇవ్వనుందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న దాని కంటే సుమారు 20 శాతం ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా బజాజ్ చెతక్ కొత్త వెర్షన్ రేంజ్ ఉండనుంది. 2.88 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉన్న ప్రస్తుత మోడల్ 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. బజాజ్ చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‍కు సంబంధించిన ఆర్టీవో డాక్యుమెంట్లు కూడా బయటికి వచ్చాయి. పూర్తి వివరాలు ఇవే..
బ్యాటరీ అదే.. కానీ రేంజ్ ఎక్కువే
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
బజాజ్ చెతక్ అప్‍డేటెడ్ వెర్షన్ కూడా 2.88 kWh బ్యాటరీనే కలిగి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా ప్రస్తుత మోడల్ కంటే అదనంగా 20 శాతం ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మొత్తంగా నయా వెర్షన్ 108 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని ఆర్టీవో డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే మోటార్ ఔట్‍పుట్ మాత్రం ప్రస్తుతం ఉన్న మోడల్‍లాగే ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్ మోటర్ 4kW పవర్‌ను కలిగి ఉంటుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిటోమీటర్ల (70 kmph)గా ఉంది. ఈ కొత్త వెర్షన్‌తో రేంజ్ విషయంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్‍ను దాటేయనుంది. ప్రస్తుత ఐక్యూబ్ ఎస్ వేరియంట్ సింగిల్ చార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది. ప్రస్తుతం ఆథెర్ ఎక్స్450ఎక్స్ స్కూటర్ 146 కిలోమీటర్లు, ఓలా ఎస్1 ప్రో 170 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తున్నాయి. వీటితోనూ చెతక్ పోటీ తీవ్రం కానుంది.
Also Read: Vivo Y100: కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో వివో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవే!
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!