Prithvi Shaw : సెల్ఫీ కోసం గొడవ.. క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగింది. షాతో పాటు అతడి స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆవరణలో పలువురు దుండగులు దాడి చేశారు. షా ప్రయాణిస్తున్న కారును బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై షా స్నేహితుడు సురేంద్ర ఓషివరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే!
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ఫిబ్రవరి 15న పృథ్వీ షా.. సురేంద్ర యాదవ్‌తో పాటు పలువురు స్నేహితులతో కలిసి ముంబైలోని శాంటా క్రూజ్ హోటల్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. షా హోటల్ దగ్గరకు వెళ్లగానే నిందితుల్లో ఇద్దరు వచ్చి సెల్ఫీలు ఆడగ్గా షా వారితో కలిసి ఫోటోలు దిగి హోటల్‌లోనికి ప్రవేశించేందుకు ముందుకు కదిలాడు. ఈలోపు మరో ఇద్దరు వచ్చి సెల్ఫీ దిగాలని షాపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు షా ఒప్పుకోకపోవడంతో వారు అతన్ని అడ్డుకున్నారు. ఈలోపు పక్కనే ఉన్న షా స్నేహితుడు హోటల్ మేనేజ్‌మెంట్‌కు ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. వారు నిందితులను హోటల్ బయటకు గెంటేశారు. దీంతో కోపంతో నిందితులు హోటల్ బయట కాపు కాచి షా ప్రయాణిస్తున బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన షా స్నేహితుడు.. అతన్ని మరో కారులోకి తరలించాడు. అయినప్పటికీ వదలని నిందితులు షా ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి లోటస్ పెట్రోల్ బంకు వద్ద మరోసారి అడ్డుకుని దాడిచేశారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు యాభై వేల నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు.
కాగా, ఇటీవలి కాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్టుల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్‌లకే ఫామ్ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు.
Also Read: Vivo Y100: కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌తో వివో కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవే!
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!