Bedurulanka 2012: ‘శివశంకర వరప్రసాద్’గా కార్తికేయ..ఈసారి కొట్టేట్టు ఉన్నాడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Kartikeya’s ‘Bedurulanka 2012’ Trailer Launched: డిసెంబర్ 21, 1012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు యుగాంతం రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్(కార్తికేయ) ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’ను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. బయట కూడా మెగాస్టార్ చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే, చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ‘బెదురులంక 2012’లో కార్తికేయ క్యారెక్టర్ పేరు కూడా అదే అన్నమాట. ఇప్పుడీ సినిమా ట్రైలర్ సైతం చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్.
Eleven: నవీన్ చంద్ర హీరోగా బై లింగ్యువల్ ‘ఎలెవెన్’
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ఇక కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్రామా… ‘బెదురులంక 2012’లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు అన్నీ ఉన్నాయని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. శివశంకర వరప్రసాద్ పాత్రలో కార్తికేయ కనిపించగా… అతడిని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా నేహా శెట్టి కనిపిస్తోంది. ఇక యుగాంతం పేరుతో కొత్త నాటకానికి తెర తీసిన పెద్దలకు శివ ఎలా బుద్ధి చెప్పాడు? అనేది కథ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ‘సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తినప్పప్పటికీ… ముందు మూడు యుగాలను అంతం అవ్వలేకుండా ఆపలేకపోయినప్పుడు, ఈ బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రామ్ ప్రసాద్) కలిసి కలి యుగాంతాన్ని ఆపేస్తానంటే మీరు ఎలా నమ్మేశారండి?’ అని హీరో ఓ డైలాగ్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది . కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని, ‘వెన్నెల’ కిశోర్ ఇతర కీలక పాత్రలలో నటించారు.
తాజావార్తలు
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!