NTV Telugu Site icon

Sardar2: సీక్వెల్ స్టార్ట్ చేసిన కార్తీ.. ఈసారి అంతకు మించి!

Sardar2

Sardar2

Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ “సర్దార్” పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గ “సర్దార్ 2” తెరకెక్కనుంది. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో హీరో కార్తీ తండ్రి శివ కుమార్ తో పాటుగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..

Also Read: Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ

అలానే ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను కూడా చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకున్నారు. మిషన్ కాంబోడియా నేపథ్యంలో సాగే సర్ధార్ 2 జూలై 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘సర్దార్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పిఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ తెరకెక్కనుంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తొలుత చెన్నైలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ పూర్తి చేసుకుని, ఆ తర్వాత కథానుగుణంగా కజకిస్తాన్, అజర్ బైజాన్, జార్జియాలో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.  ఇదిలా ఉండగా రీసెంట్ సెన్సేషన్ బ్యూటీ ఆషికా రంగనాథన్ ఇందులో కీలకపాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా.. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు.