Sardar2: సీక్వెల్ స్టార్ట్ చేసిన కార్తీ.. ఈసారి అంతకు మించి!
- సీక్వెల్ స్టార్ట్ చేసిన కార్తీ
- స్పై యాక్షన్ థ్రిల్లర్ గ త్వరలోనే తెరకెక్కనుంది
- ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sardar2 Shooting Update: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చుసిన సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒక సినిమా తీసిన తరువాత ఆ సినిమా హిట్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ లో కామన్ గ కనిపిస్తుంది. అలానే ఈ చిత్రాలకు సీక్వెల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసే ఓ మూవీ సీక్వెల్ స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్ హీరో కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ “సర్దార్” పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గ “సర్దార్ 2” తెరకెక్కనుంది. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో హీరో కార్తీ తండ్రి శివ కుమార్ తో పాటుగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..
Also Read: Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
అలానే ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను కూడా చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకున్నారు. మిషన్ కాంబోడియా నేపథ్యంలో సాగే సర్ధార్ 2 జూలై 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘సర్దార్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పిఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ తెరకెక్కనుంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తొలుత చెన్నైలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ పూర్తి చేసుకుని, ఆ తర్వాత కథానుగుణంగా కజకిస్తాన్, అజర్ బైజాన్, జార్జియాలో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ సెన్సేషన్ బ్యూటీ ఆషికా రంగనాథన్ ఇందులో కీలకపాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా.. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తారు.
The auspicious pooja for #Karthi starrer #Sardar2 took place recently and the shooting of the film is scheduled to start on July 15th 2024 in grand sets in Chennai.@Karthi_Offl @psmithran @Prince_Pictures @lakku76 @venkatavmedia @thisisysr @george_dop @rajeevan69 @dhilipaction… pic.twitter.com/nVraSAbMi4
— Prince Pictures (@Prince_Pictures) July 12, 2024
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!