రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘ఓ రెండు మేఘలిలా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ‘బేబీ’ టీజర్ కూడా ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘బేబీ’ సినిమా విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఆనంద్ దేవరకొండ ఒక విషయంలో బాగా అప్సెట్ అయినట్లు కనిపిస్తున్నాడు.
రౌడీ హీరోని అంతలా అప్సెట్ చేసిన విషయం, ‘అర్జెంటినా’ ఫుట్ బాల్ వరల్డ్ కప్ గెలవడం. ఫిఫా వరల్డ్ కప్ రీసెంట్ గా ముగిసింది, ఫుట్ బాల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనల్ గా పేరు తెచ్చుకున్న గేమ్ లో ‘అర్జెంటినా’ గెలిచింది. ఫ్రాన్స్, అర్జెంటినా తలపడిన ఈ ఫైనల్స్ లో ఆనంద్ దేవరకొండ, ఫ్రాన్స్ ని సపోర్ట్ చేశాడు. చాలా చిన్న మార్జిన్ లో ఫ్రాన్స్ ఫైనల్స్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ ఆటగాడు ‘ఎంబప్పే’ అద్భుతంగా ఆడాడు కానీ టీంని విజయ తీరాలకి చేర్చలేకపోయాడు. ఈ విషయంలో ఆనంద్ దేవరకొండ బాగానే అప్సెట్ అయినట్లు ఉన్నాడు. అందుకే ఫ్రాన్స్ ని మద్దతుగా, ఎంబప్పేకి మద్దతుగా ఎవరు ట్వీట్ చేసినా దాన్ని లైక్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ లో గెలవడం ఓడిపోవడం అనే విషయాలని స్పోర్టివ్ గా తీసుకోవాలని చాలా మంది చెప్తుంటారు కానీ అది అన్ని సార్లు జరగడం కష్టం. మనం సపోర్ట్ చేసే టీం, మనకి నచ్చిన టీం గెలిస్తేనే కదా మనకి హ్యాపీగా ఉండేది.