Salaar: సలార్ కాదు… దేవా కాదు… దేవరథ కాదు… ఇదే ప్రభాస్ క్యారెక్టర్ పూర్తి పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్ కి న్యాయం చేసే సీన్స్ ని ప్రశాంత్ నీల్ సూపర్బ్ గా డిజైన్ చేసాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరోగా టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సలార్ సినిమాని నడిపించాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు దేవా, పూర్తి పేరు దేవరథ అని సినిమా చూసిన వాళ్లకి తెలుసు.
అయితే ఫస్ట్ డే థియేటర్స్ లో చేసిన సినిమా చూసిన వాళ్లకి ఆ అరుపుల్లో సరిగ్గా వినపడి ఉండదు కానీ ప్రభాస్ క్యారెక్టర్ పేరు దేవరథ మాత్రమే కాదు… “దేవరథ రైసాని”. సలార్ ఇంటర్వెల్ సీన్ లో శ్రీయ రెడ్డి ప్రభాస్ రాకెట్ లాంచర్ పైన నిలబడి ఉన్నప్పుడు ఎలివేషన్ ఇస్తూ… “వరద రాజమన్నార్ కా సలార్… ఖాన్సార్ కా సలార్… సలార్ దేవరథ రైసాని” అని చెప్తుంది. ఈ టైమ్ లో వచ్చే విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పూనకాలు వస్తాయి. ఇంకా కంప్లీట్ గా ప్రభాస్ క్యారెక్టర్ పేరు చెప్పాలి అంటే… శౌర్యాంగ దేవరథ రైసాని. ఇది సలార్ సినిమాలో ప్రభాస్ ఐడెంటిటీ. థియేటర్స్ లో ఇంకోసారి సినిమా చూసేయండి సలార్ ఇంటర్వెల్ బ్లాక్ లో శ్రీయ రెడ్డి ఇచ్చే ఎలివేషన్ ఇప్పుడు డైలాగ్ తో సహా అర్ధమవుతుంది.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!