Site icon NTV Telugu

రిపబ్లిక్ : ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

Here is The First Look of Aishwarya Rajesh as Myra Hanson from REPUBLIC

“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్ తో పాటు ఉన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో మైరా హాన్సన్ అనే పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

Read Also : “అఖండ” రిలీజ్ డేట్ ఫిక్స్… యంగ్ హీరోకు షాక్

ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్, న్యాయం లాంటి ప్రధానాంశాల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. మణిశర్మ సంగీతం అందించారు.

Exit mobile version