పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). రెబల్ స్టార్ తో సాహో సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ పవర్ స్టార్ OG చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : RT76 : రవితేజ – కిశోర్ తిరుమల టైటిల్ ఇదే
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసారు మేకర్స్. పవన్ గత సినిమాలను మించి OG థియేట్రికల్ బిజినెస్ జరగినట్టు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రలోని ఉత్తరాంధ్ర నుండి నెల్లూరు వరకు కలిపి రూ. 81 కోట్ల రేషియోలో అమ్మకాలు చేసారు మేకర్స్. నైజాం మరియు ఉత్తరాంధ్ర ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేసారు. అలాగే రాయలసీమ ఏరియాను టాలీవుడ్ టాప్ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ దక్కించుకున్నారు. తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలను జనసేన పార్టీ కాకినాడ ఎంపీ టీ టైమ్ ఉదయ్ కొనుగోలు చేసారు. కృష్ణ జిల్లాను ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ధీరజ్ మొగిలినేని సొంతం చేసుకున్నారు. గుంటూరు జెపిఆర్ ఫిల్మ్స్ కు ఆల్మోస్ట్ ఓకే చేసారని సమాచారం. ఇక మరొక కీలకమైన కర్ణాటక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా క్లోజ్ చేశారు. హోల్ సేల్ గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 12 కోట్లు మరియు జీఎస్టీ అదనం కలిపి కర్ణాటకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ JPR FILMS పవన్ సినిమా రైట్స్ ను దక్కించుకుంది.