He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ విజువల్ వండర్ ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లీష్ ట్రైలర్‌తో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ అయిన ‘హీ-మ్యాన్’ (ప్రిన్స్ ఆడమ్) పాత్రకు నిఖిల్ తన పవర్ఫుల్ వాయిస్‌ను అందించారు. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ ఐకానిక్ క్యారెక్టర్‌కు ఆయన గాత్రం తోడవ్వడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్లో నిఖిల్ బేస్ వాయిస్ ఆ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిఖిల్ మాత్రమే కాకుండా.. ఈ హాలీవుడ్ చిత్రానికి మన టాలీవుడ్ ప్రముఖుల వాయిస్ అదనపు బలాన్ని చేకూర్చింది. పవర్ఫుల్ విలన్ ‘స్కెలెటర్’ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన గంభీరమైన గాత్రాన్ని అందించగా, ‘డంకన్’ పాత్రకు వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. ఈ స్ట్రాంగ్ వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని ఫాంటసీ, యాక్షన్ ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు మరింత నాచురల్‌గా, దగ్గరగా కనెక్ట్ కానున్నాయి. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. నికోలస్ గలిట్జైన్ (హీ-మ్యాన్), కమిలా మెండెస్ (టీలా) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జారెడ్ లెటో (స్కెలెటర్), ఇడ్రిస్ ఎల్బా (మ్యాన్-అట్-ఆర్మ్స్) వంటి హాలీవుడ్ దిగ్గజాలు నెగెటివ్ అండ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అలిసన్ బ్రి, మొరెనా బక్కారిన్, క్రిస్టెన్ విగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొత్త తరానికి ‘హీ-మ్యాన్’ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ను సోనీ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయంగా పంపిణీ చేస్తోంది. ఈ జూన్ 5వ తేదీన ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం భారత దేశ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది.
Also Read
- NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
- Irummudi: ‘బాహుబలి', 'పుష్ప' సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!