పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే… స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… గత కొన్ని రోజులుగా జరుపుకోవడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో… ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకావడం అనుమానమేనంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్‌గా మాస్ మహారాజా రవితేజతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. దీంతో ఉస్తాద్ ఇప్పట్లో లేనట్టేనని అనుకున్నారు. అంతేకాదు… ఏకంగా ఈ సినిమా ఆగిపోయినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి కానీ బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు హరీష్ శంకర్. అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌గా వెళ్లిన హరీష్… లేటెస్ట్ ప్రోమోలో ఉస్తాద్ భగత్‌సింగ్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘ఏంటి బాబాయ్ వారాహి హాలీడేసా? ఫ్రీగా ఉన్నావ్’.. అని హరీష్ శంకర్‌ను బాలకృష్ణ అడగ్గా.. ‘గ్యాప్ మట్టుకు వెకేషన్.. సినిమా రిలీజైతే సెన్సేషనే’ అంటూ బదులిచ్చాడు హరీష్ శంకర్. దీంతో ఇది ఉస్తాద్ భగత్ సింగ్ గురించేనని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గ్యాప్‌ను ఉద్దేశించే హరీష్ ఇలా కామెంట్స్ చేశాడనే టాక్ కూడా నడుస్తోంది. ఏదేమైనా… గబ్బర్ సింగ్ తర్వాత పుష్కర కాలానికి సెట్ అయిన ఈ పవర్ ఫుల్ కాంబో పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉస్తాద్ షూటింగ్‌కు బ్రేక్ పడొచ్చు కానీ… సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా. ఇదే విషయాన్ని గ్లింప్స్‌తో చెప్పేశాడు హరీష్ శంకర్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి.