నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.. స్టేజి మీద ఉన్న అతిధులను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ గోల చేస్తుంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చ్చేశారు. ఆయన మాట్లాడుతూ “ముందుగా అభిమానులందరికి నమస్కారం.. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్.. కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు.. నేను స్టేజిమీద చాలా సార్లు విన్నాను. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్క ఫ్యామిలీ కాదు.. ఇండస్ట్రీ అంతా ఒకే ఫ్యామిలీ.. అలా చెప్పారు కాబట్టే ఇప్పుడు ఈ ఫంక్షన్ కు కళ్యాణ్ గారు రావడం.
మీ అందరికీ నాది ఒకటే రిక్వెస్ట్.. మీరు బయట సినిమా ఫంక్షన్లకు కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు కనుక డిస్ట్రబెన్స్ చేయకుండాఫంక్షన్ సజావుగా సాగి ఆర్టిస్టులందరికీ కొంచెం రెస్పెక్ట్ ఇస్తే.. ఆయన ఇలాంటి పది ఫంక్షన్లకు వస్తారు. మనం బయట ఆయనను చూడొచ్చు.. మీరు కనుక ఇలాగే గోల చేస్తూ ఎవ్వరిని మాట్లాడకుండా చేస్తే.. ఆయన ఏ ఫంక్షన్ కు రారు.. చివరకు ఆయనను యూట్యూబ్ లో వెతుకోవాల్సి వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ లో పవన్ సినిమా ఉంటుంది.. అది ఎప్పుడు వచ్చిన మీరు మళ్లీ మళ్ళీ చూసేలా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆ సినిమా గురించి చెప్పే సమయం, సందర్భం ఇది కాదు ఎందుకంటే ఇది నాని ఫంక్షన్.. ఈ మధ్యనే ఈ సినిమా చూసాను .. చాలా బావుంది.. కడుపుబ్బా నవ్వించి కళ్ల వెంబటి నీళ్లు తెప్పించారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. గెలుపు శాశ్వతం కాదు.. ధర్మం.. ధర్మం మాత్రమే శాశ్వతం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.