Site icon NTV Telugu

HHVM : ‘వీరమల్లు’ కోసం చార్మినార్ సెట్.. ఆ రెండు సీన్లు అదిరిపోతాయట..

Hhvm Pre Release Event

Hhvm Pre Release Event

HHVM : పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ల తర్వాత జులై 24న రిలీజ్ కాబోతోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీలో సెట్స్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మూవీ కోసం నేచురల్ చార్మినార్ సెట్ వేశాం. పవన్ కల్యాణ్‌ ఒక పెద్ద స్టార్. ఆయన్ను వర్జినల్ చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి ఒక రెండు నిముషాలు కూడా షూట్ చేయలేం అనిపించింది. మాకు కావాల్సినట్టు షూట్ చేయడం కష్టం. అందుకే నిజమైన చార్మినార్ ను పోలినట్టు ఉండే సెట్ వేశాం.

Read Also : Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో రిలీజ్..

దానికి భారీగానే ఖర్చు అయింది. కానీ ఆ సెట్ దగ్గర పవన్ కల్యాణ్‌ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. రెండు ప్లేస్ లలో పవన్ కల్యాణ్‌ రోల్ ను పరిచయం చేసే సీన్లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. పవన్ కల్యాణ్‌ ను ఎన్నడూ చూడని కోణంలో మీరు చూస్తారు. ఆయన ఎప్పుడూ చేయని యాక్షన్ సీన్లు ఇందులో కనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు ఏఎం రత్నం.

Read Also : Kota Srinivas : కూతురు అలా.. భార్య ఇలా.. ‘కోట’ జీవితంలో కన్నీటి సునామీ..

Exit mobile version