Happy Ending trailer: టాలెంటెడ్ యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా “హ్యాపీ ఎండింగ్”లో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హామ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్ల మీద యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇక హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ ఆద్యంతం నవ్విస్తూ ఆకట్టుకునేలా కట్ చేశారు. హీరో గురించి తన ఫ్రెండ్ చెబుతూ ఉండడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
Asian Vaishnavi: మొన్నటిదాకా థియేటర్ వార్.. ఇప్పుడు కలిసి ఓపెనింగ్?
మా ఫ్రెండ్‌కు ఓ బాబా శాపం ఇచ్చాడు, మా ఫ్రెండ్ ఎవరికైన పూజ చేసి తాంబూలం ఇస్తే(శృంగారం) వారి ఫొటోలకు అందరూ పూలు పెడుతున్నారు(చనిపోతున్నారు) స్వామి” అని అతను చెబుతాడు. అది కార్థం కానీ స్వామి ఏమిటి అని అడిగితే విజువల్ గా అర్ధం అయ్యేలా చెప్పడంతో షాక్ తగులుతుంది. ఫ్రెండ్ గా మాడ్ ఫేమ్ విష్ణు, బాబా గెటప్‌లో అజయ్ ఘోష్ కనిపించారు. ఇక మనుషుల్లో రెండు రకాలు. కోరికలు కంట్రోల్ చేసుకునేవాళ్లు. వాటివల్ల కంట్రోల్ కాబడే వాళ్లు అని అజయ్ ఘోష్ డైలాగ్‌తో హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. హ్యాపీ ఎండింగ్ మూవీ ఒక అడల్ట్ కామెడీలా కనిపిస్తోంది కానీ ఫ్యామిలీస్ తో కలిసి చూసే సినిమా అని హీరో చెబుతున్నాడు. ట్రైలర్ కట్ చాల బాగుంది, మరి సినిమా ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సి.