HBD Vijay: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Happy Birthday Vijay Deverakonda: ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన సినిమాలను గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తోందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్లు తమకూ విజయ్ దేవరకొండ లాంటి ఒక మంచి కెరీర్ ఉంటుందనే హోప్స్ పెట్టుకుంటున్నారు. తన సక్సెస్ తో చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు విజయ్. రేపు మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూద్దాం.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా, ఈజ్ తో నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ఈ కొత్త అబ్బాయి బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడని అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన మాస్టర్ పీస్ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్, ఆ సినిమాలో డాక్టర్ అర్జున్ గా విజయ్ పర్ ఫార్మెన్స్ చూసి బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ ఫ్యాన్స్ అయ్యారు. ఈ సినిమా మిస్ అయినందుకు స్టార్ హీరోలు, ఇలాంటి సినిమా తామెందుకు చేయలేదని డైరెక్టర్స్ ఫీలయ్యారు, విజయ్ ను అప్రిషియేట్ చేశారు.
Also Read
- Prabhas Srinu : "రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది".. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
- Nara Rohith: 'కపాలి'తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
- Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
- Prabhas Srinu: 'ప్రభాస్ శ్రీను' పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే..గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. సినిమా మీద ప్యాషన్, నటన మీద ప్రేమ, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్ గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా టైమ్ లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి, పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించాడు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తున్నారు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు చేయిస్తారు విజయ్. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించారు. ఇలా మంచి మనసున్న స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మూడు క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న వీడీ 12 సినిమా విశాఖలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సెట్ లోనే విజయ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు. క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్న విజయ్ దేవరకొండకు హ్యాపీ బర్త్ డే.
తాజావార్తలు
-
Prabhas Srinu : “రాజమౌళిని చూస్తే గర్వం మొత్తం పోతుంది”.. ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!
-
IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్‌గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!