భీమవరం బుల్లోడు … సునీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 28న నటుడు సునీల్ పుట్టినరోజు)
మధ్యలో కథానాయకునిగా కసరత్తులు చేసి మెప్పించాడు కానీ, అంతకు ముందు సునీల్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. హీరోగానూ కొన్ని చిత్రాలలో బాగానే ఆకట్టుకున్నాడు సునీల్. ముద్దుగా బొద్దుగా ఉన్నప్పుడే సునీల్ బాగుండేవాడని కొందరి మాట! లేదు నాజూగ్గా మారిన తరువాతే సునీల్ భలేగా ఉన్నడన్నది మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా హాస్యనటులు హీరోలుగా అలరించిన వారి జాబితాలో సునీల్ చేరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ బొద్దుగా మారి అలరించే ప్రయత్నం చేస్తున్నారు సునీల్.
సునీల్ 1974 ఫిబ్రవరి 28న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జన్మించారు. చిన్నతనం నుంచీ ఇతరులను ఇమిటేట్ చేస్తూ అలరించేవారు సునీల్. కాలేజ్ లోనూ తన అభినయంతో ఆకట్టుకున్నారు. నేటి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ కాలేజ్ లో మంచి స్నేహితులు. అక్కడ నుంచే వారిద్దరూ చిత్రసీమలో రాణించాలని కలలు కన్నారు. ఒకప్పుడు హాస్యనటుడు పద్మనాభం పలు చిత్రాల్లో నవ్వుల్లో వైవిధ్యం చూపిస్తూ నటించారు. అదే పంథాలోనే సునీల్ కూడా సాగారనిపిస్తుంది. ఆరంభంలో మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన చిత్రాల్లో కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించారు. ఆ తరువాత తనదైన మార్కు ప్రదర్శించారు. ఆ పై సొంత బాణీ పలికిస్తు, పలు చిత్రాలలో పకపకలు పంచారు. టాప్ స్టార్స్ అందరితోనూ నటించి అలరించిన సునీల్ కు తేజ తెరకెక్కించిన ‘నువ్వు-నేను’ ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డు సంపాదించి పెట్టింది. ఆ తరువాత ‘ఆంధ్రుడు’లోనూ సునీల్ హాస్యాభినయానికి మరో నంది అవార్డు దక్కింది.
Also Read
‘అందాలరాముడు’లో కథానాయకునిగా అలరించిన సునీల్ కు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ మరింత మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ సినిమా సునీల్ కు కెరీర్ బెస్ట్ గా నిలచింది. ఆ తరువాత సునీల్ పలు చిత్రాల్లో నాయక పాత్రలే పోషించారు. ‘పూలరంగడు’ మినహా, సునీల్ హీరోగా నటించిన చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో మిత్రుడు త్రివిక్రమ్ సూచన మేరకు మళ్ళీ నవ్వించే ప్రయత్నం మొదలు పెట్టారు సునీల్. కొన్ని సార్లు కితకితలు పెట్టారు. మరికొన్ని సార్లు సెంటిమెంట్ తోనూ కొట్టారు. అయినా మునుపటి వైభవం సునీల్ కు కనిపించలేదు. ఈ మధ్య ‘కలర్ ఫోటో’ అనే సినిమాలో విలన్ గానూ నటించి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప’లో మంగళం శ్రీను పాత్రలో భలేగా ఆకట్టుకున్నారు. మరికొందరు యంగ్ హీరోస్ చిత్రాల్లోనూ సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది సునీల్ కు గత వైభవం తెచ్చి పెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!