(ఫిబ్రవరి 28న నటుడు సునీల్ పుట్టినరోజు)మధ్యలో కథానాయకునిగా కసరత్తులు చేసి మెప్పించాడు కానీ, అంతకు ముందు సునీల్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. హీరోగానూ కొన్ని చిత్రాలలో బాగానే ఆకట్టుకున్నాడు సునీల్. ముద్దుగా బొద్దుగా ఉన్నప్పుడే సునీల్ బాగుండేవాడని కొందరి మాట! లేదు నాజూగ్గా మారిన తరువాతే సునీల్ భలేగా ఉన్నడన్నది మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా హాస్యనటులు హీరోలుగా అలరించిన వారి జాబితాలో సునీల్ చేరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ బొద్దుగా…