డాక్టర్ రాజశేఖర్ షష్టి పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 4న డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు)
డాక్టర్ రాజశేఖర్ తెరపై కనిపించగానే, ఆయన అభిమానుల ఆనందం అంబరమంటేది. యాంగ్రీ మేన్ గా ఈ నాటికీ ఆయన అలరిస్తున్న తీరు మరపురానిది. ఇప్పటికీ తనకు తగ్గ పాత్రలు పోషించడానికి ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు రాజశేఖర్. ఆ ఉత్సాహమే ఆయన అభిమానులనకు ఆనందం పంచుతోంది. ఓ వైపు తన ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లు గా నటిస్తున్న సమయంలో రాజశేఖర్ ఇప్పటకీ హీరో వేషాలతో అలరించే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం!
రాజశేఖర్ పూర్తి పేరు రాజశేఖర్ వరదరాజన్. 1962 ఫిబ్రవరి 4న ఆయన జన్మించారు. తేని జిల్లాలోని లక్ష్మీపురం రాజశేఖర్ జన్మస్థలం. ఆయన తండ్రి డి.సి.వరదరాజన్ పోలీస్ ఆఫీసర్. ఇంట్లో అందరికంటే పెద్దవాడయిన రాజశేఖర్ కన్నవారి కలలు నెరవేరుస్తూ బుద్ధిగా చదువుకొని డాక్టర్ అనిపించుకున్నారు. డాక్టర్ చదివే రోజుల్లోనే ఆయనకు ఉన్న నటనాభిలాషను గమనించి పలువురు మిత్రులు ప్రోత్సహించారు. అయితే ఎమ్.బి.బి.యస్., పూర్తయిన తరువాతే నటన అంటూ ముందు డాక్టర్ గిరీ పూర్తి చేసి,కొద్ది రోజులు మద్రాసులో ప్రాక్టీస్ కూడా పెట్టారు. తరువాత భారతీరాజా తెరకెక్కించినపుదుమై పెన్ చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు రాజశేఖర్. తెలుగులో ప్రతిఘటన చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ చిత్రంలో పోలీసాఫీసర్ గా నటించిన రాజశేఖర్ ఆ తరువాత అంకుశంలోనూ పవర్ ఫుల్ పోలీస్ గా నటించి ఆకట్టుకున్నారు. అంకుశం ఘనవిజయం రాజశేఖర్ కు యాంగ్రీ మేన్ గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ తరువాత వరుసగా పలు పవర్ ఫుల్ రోల్స్ నటించి ఆకట్టుకున్నారాయన. మొదట్లోనే పలు వైవిధ్యమైన పాత్రలతో మురిపించారు రాజశేఖర్. తలంబ్రాలులో రాజశేఖర్ అభినయానికి బెస్ట్ విలన్ గా ఆయనకు నంది అవార్డు లభించింది. ఆ పై రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ లాగా అల్లరి ప్రియుడు సినిమాతో మారిపోయారు. రాజశేఖర్ సైతం స్టెప్స్ తో మురిపిస్తాడని జనం అల్లరి ప్రియుడుకు జేజేలు పలికారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
రాజశేఖర్ షూటింగ్స్ కు సరైన సమయానికి రారు అనే పేరు సంపాదించారు. అయినా కొన్ని పాత్రలకు రాజశేఖర్ మాత్రమే న్యాయం చేయగలరని భావించిన వారు ఆయననే తమ హీరోగా ఎంచుకునేవారు. రావడంలో ఆలస్యం ఉంటుందేమో కానీ, వచ్చిన తరువాత అందరూ మెచ్చేలా నటించడానికి తపించేవారు రాజశేఖర్. అందుకే ఆయన ఎప్పుడు వచ్చినా సరే, అదే భాగ్యం అనుకుంటూ చిత్రాలు రూపొందించి విజయం సాధించారు సినీజనం. తనదైన బాణీ పలికిస్తూ అనేక పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసిన రాజశేఖర్ ఆ మధ్య బాగా వెనకబడిపోయారు. గరుడవేగతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనేలా చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆర్జీవీ దెయ్యంలో విలక్షణమైన పాత్రలో అలరించారు. శేఖర్ అనే చిత్రంలో నటించారు రాజశేఖర్.
రాజశేఖర్ విజయం వెనుక ఆయన అర్ధాంగి జీవిత ఉన్నారని అందరికీ తెలుసు. ఈ దంపతుల కూతుళ్ళు శివానీ, శివాత్మిక సైతం కన్నవారి బాటలో పయనిస్తూ నటనలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ మరిన్ని చిత్రాలతో అలరిస్తారని అభిమానుల అభిలాష. ఈ యేడాదితో షష్టి పూర్తి చేసుకుంటున్న రాజశేఖర్ ఇకపై మరింతగా జనాన్ని మురిపిస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!