Megastar Birthday Special : చిత్ర పరిశ్రమ ‘పునాదిరాళ్ల’లో ఒకరైన ‘మన శంకరవరప్రసాద్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు చిరు. 1974 ఆగస్టు 22న మొగల్తూరులో అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు జన్మించాడు. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఏ ముహూర్తాన నాడు వరప్రసాద్ అనే పేరు పెట్టారో కానీ నేడు కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్.
తొలి అడుగు –
Also Read
చెన్నై లోని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత పునాది రాళ్ళు చిత్రంతో చిత్ర సీమలో అడుగుపెట్టిన చిరంజీవి, కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో కష్టాలు మరెన్నో సవాళ్లు, అవమానాలు ఎదురైనా ఎక్కడా కృంగిపోకుండా, లక్ష్య సాధనకై పిడికిలి బిగించి, అకుంఠిత దీక్షతో, పట్టువిడవకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని నటనలో శిఖరాగ్రాన్ని అధిరోహించారు చిరు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది.
వివాహాం :
హీరోగా ఎదుగుతున్న క్రమంలో 1980 ఫిబ్రవరి 20 న హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది. చిరు పెళ్లి రోజు MS రెడ్డి నిర్మించిన తాతయ్య ప్రేమలీలలు చిత్రం సాంగ్ షూటింగ్ లో ఉన్నారు చిరు. ఆ షూటింగ్ నుండి నేరుగా పెళ్లి మండపానికి వచ్చిన చిరుని ఎవరో చొక్కా చిరిగింది మార్చుకోండి అంటే షర్ట్ చిరిగితే తాళి కట్టనివ్వరా అని చమత్కరించారంట. ఇక సురేఖ రాకతో చిరు కెరీర్ మరో టర్న్ తిరిగిందనే చెప్పాలి.
సక్సెస్ జర్నీ –
1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సూపర్ హిట్ సక్సెస్ జర్ని స్టార్ట్ అయింది. తర్వాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ చిత్రంలో చిరు అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు చిరు. ఆ తర్వాతి ఏడాది అనగా 1983లో ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి చిరంజీవిని కాస్త సుప్రీమ్ హీరో చిరంజీవిగా మార్చింది. అక్కడి నుండి చిరు వెనుదిరిగి చూసుకోలేదు. పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు గ్రేసింగ్ స్టార్. 1990లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. గ్యాంగ్ లీడర్, అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు, విజేత, రుద్రవీణ వంటి వరస హిట్స్ తో మెగాస్టార్ గా అవతరించారు చిరంజీవి. 2002లో వచ్చిన ఇంద్ర అప్పటివరకు ఉన్న రికాడ్స్ బద్దలు కోట్టి ఇండస్ట్రి హిట్ గా నిలిచింది.
నటనకు విరామం –
కెరీర్ పీక్స్ లో ఉండగా 2007లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాలు కారణంగ సుమారు పదేళ్ల పాటు మరే సినిమాలో నటించలేదు మెగాస్టార్. అప్పట్లో ఇక అభిమాన నటుడిని సిల్వర్ స్కీన్ పై చూడలేమని ఆయన అభిమానులు ఆందోళ చెందారు. సినిమాలు ఆపోద్దని విన్నవించారు.
రాజకీయ ప్రవేశం –
తనను ఎంతో ఆదరించిన తెలుగు ప్రజలకు సేవ చేసుకునేందుకు సినిమాలు వదిలేసి రాజకీయాలలో అడుగుపెట్టారు చిరంజీవి. 2008 ఆగస్టు 26 న మదర్ థెరిసా జన్మదినం సందర్భంగా ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు చిరు. 2009 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఓటమి, పాలకొల్లులో ఓటమి ఇలా రకరకాల కారణాలతో తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసారు చిరంజీవి. ఆ తర్వత రాజకీయాల నుండి తప్పుకుని తిరిగి కళామతల్లి ఒడికి చేరుకున్నారు.
బాస్ ఈజ్ బ్యాక్ –
పది సంవత్సరాల గ్యాప్ తర్వత మళ్లి ముఖానికి రంగు వేసుకుని ఖైదీ నెం.150లో నటించారు చిరు. 2017 జనవరి 11 న విడుదల అయన ఈ సినిమా చిరులో గ్రేస్, నటనలో వాడి వేడి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించి సూపర్ హిట్ సాధించింజి. ప్రస్తుతం విశ్వంభర అనే పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు బాస్..
సేవా కార్యక్రమాలు –
సినిమాలోలతో పాటు సేవా కార్యక్రమాల్లోను మెగాస్తార్ ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు 1998లో అక్టోబరు 2న ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు. ‘చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బాంక్’ వంటి సేవా సంస్థలు స్థాపించి ఎందరో జీవితాలలో వెలుగులు నింపి జై చిరంజీవిగా విరాజిల్లుతున్నారు.
ఈ ఆగస్టు 22 న 70 వ పడిలో అడుగెడుతున్న మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదగడం, తమ్ముడు పవన్ కళ్యాన్ డిప్యూటి సీఎంగా ఉండడం, కూతురు నిర్మాతగా సక్సెస్ ఫుల్ అవడం వంటి మొమరబుల్ మూమెంట్స్ తో ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారు. అయిన స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి సినీజీవితాన్ని పూనాదిరాళ్ల నుండి వివరించాలంటే ఒక పుస్తకం సరిపోదు. ఇండస్ట్రీలో ఏదో సాధించాలనే వచ్చే ఎందరో కళాకారుల కళలకు కేరాఫ్ గా నిలిచి నేటి పరిశ్రమ పునాదిరాళ్లలో ఒకరైన మన శంకరవరప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
తాజావార్తలు
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?