Happy Birthday: ‘వారియర్’ను ఢీ కొట్టబోతున్న అందాల చిన్నది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లావణ్య త్రిపాఠీ, సత్య, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా… నవీన్ యేర్నేని, వై రవిశంకర్ సమర్పిస్తున్నారు. ‘మత్తు వదలరా’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాను జూలై 15న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు గురువారం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. అయితే… ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఒక రోజు ముందు అంటే జూలై 14న రామ్ ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ విడుదల కాబోతోంది. రామ్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఆ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడు కాగా తమిళ దర్శకుడు లింగుస్వామి దీనిని తెరకెక్కిస్తున్నాడు. మరి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది వారియర్’తో పాటు రాబోతున్న లావణ్య త్రిపాఠి ‘బర్త్ డే పార్టీ’ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?