Hanuman: హనుమాన్ ఒక రోజు ముందే బరిలోకి.. టీం సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman movie paid premieres on 11th January: ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హనుమంతుడిని వానర రూపంలో హిందువులు దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్’లో వానరం ప్రత్యేక పాత్ర ఉంది. ‘హను-మాన్’లో వానరం పేరు కోటి, అది సినిమా అంతటా ఉంటుందని అంటున్నారు. ఈ కీలక పాత్రకు మాస్ మహారాజా రవితేజ తన వాయిస్ ని అందించారు. అఖండ భారత్‌లోని ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన హను-మాన్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. అంజనాద్రి అనే ఫాంటసీ లోకం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Guntur Kaaram: గుంటూరు కారం సెన్సార్ కూడా అయిపోయింది.. బాబు దిగుతున్నాడు!
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ఇక సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఒక పక్కన ఉండగా మరోపక్క గుంటూరు కారం కూడా రిలీజ్ చేస్తూ ఉండడంతో గట్టి పోటీ నెలకొంది. రెండూ జనవరి 12న రిలీజ్ అవుతూ ఉండగా ఇప్పుడు హనుమాన్ మేకర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే జనవరి 11న హనుమాన్ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా, వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించగా, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల. హను-మాన్ జనవరి 12న సంక్రాంతికి తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!