Hanuman: ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. కానీ, కొంతమంది హీరోలకు మాత్రమే భక్తులు ఉంటారు. అందులో ప్రభాస్ కూడా ఒకడు. ప్రభాస్ కు ఫ్యానిజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక అభిమానుల కోసం ప్రభాస్ సైతం ఏదైనా చేస్తాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్.. ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనునందు. నేడు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మేకర్స్.. ఆదిపురుష్ నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీతాలక్ష్మణ హనుమంతుని సమేతంగా రాముడు కొలువుతీరిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా నుంచి ఏ పోస్టర్ రిలీజ్ అయినా అభిమానులు తమకు నచ్చిన ఎడిట్స్ చేసి.. తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా హనుమాన్ సినిమా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒరిజినల్ రాముడుకు బదులు ఆదిపురుష్ పోస్టర్ ను ఎడిట్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది.
తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు పండుగ కావడంతో మేకర్స్ ఒక అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుడు.. తన గుండెలను చీల్చి.. అందులో కొలువై ఉన్న సీతారాములను చూపిస్తున్న ఫోటో అది. ఆ ఫోటోను ప్రభాస్ ఫ్యాన్స్ తమకు నచ్చినట్లు ఎడిట్ చేసుకున్నారు. హనుమంతుడి గుండెల్లో ప్రభాస్ ఆదిపురుష్ పోస్టర్ ను ఎడిట్ చేసి షాక్ ఇచ్చారు. ఇక ఆ ఎడిటింగ్ కూడా ఎంతో అందంగా ఉండడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం.. ఈ పోస్టర్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కు ఎంత పిచ్చో ఇంతకంటే ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.