తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కలిసి హిస్టరీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా హనుమాన్. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్రా, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ మూవీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఇండియాలోనే కాదు మన ఇండియా సూపర్ హీరోకి నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3.6 మిలియన్ మార్క్ ని క్రాస్అయ్యింది. ఆ సెంటర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 మూవీస్ లో హనుమాన్ చోటు దక్కించుకుంది. హనుమాన్ మూవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని, స్టార్ హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కేవలం వారం రోజుల్లోనే దాటేసింది. ఇది హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి.
ఓవరాల్ గా హనుమాన్ సినిమా మొదటి వారం 150 కోట్ల గ్రాస్ ని రాబట్టింది అంటే హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించని ఈ మూవీ దెబ్బకి సాహూ, ఆదిపురుష్, భరత్ అనే నేను, రంగస్థలం, అల వైకుంఠపురములో నార్త్ అమెరికా కలెక్షన్స్ బ్రేక్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ ని దాటేస్తూ టాప్ 5 చేరుకున్న హనుమాన్ ముందు ఇప్పుడు కొండంత టార్గెట్ ఉంది. బాహుబలి పార్ట్ 1 సినిమా 8.47 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఈ ఫిగర్ ని అఛీవ్ చేయడం హనుమాన్ ని కష్టం అయ్యే పనే కానీ ఇకపై రాజమౌళి-ప్రభాస్ సినిమాల తర్వాత నార్త్ అమెరికాలో టాప్ లో ఉండే సినిమా హనుమాన్ అనే చెప్పాలి. మరి థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది? ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.