Sai Durga Tej: ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో సూపర్ హీరో తేజ సజ్జ నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు మేకర్స్ జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు చాలా ప్యాషనేట్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా చూపించాలని భావించి హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు హనుమాన్ 3D రూపంలో వస్తోంది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది. అందరూ కలిసి జూన్ 25న థియేటర్లకు రండి. ఈ సినిమాకు పనిచేసిన ప్రశాంత్ వర్మ, తేజ , అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చని అన్నారు
సూపర్ హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. నేను కూడా మీతో పాటు ఇప్పుడే మొదటిసారి ఈ 3D ట్రైలర్‌ను చూశాను. నిరంజన్ గారు, చైతన్య గారు ఎంతో కష్టపడి దీనిని రెడీ చేశారు. ఇప్పటివరకు వారు పడిన శ్రమ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది. 3D చాలా అద్భుతంగా వచ్చింది. ఇది అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. నేనూ మీలాగే మళ్లీ థియేటర్లలో ఈ సినిమాను 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ టీమ్‌ను మళ్లీ కలవడం ఒక రీయూనియన్‌లా అనిపించింది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం. సాయి దుర్గ తేజ్ గారు, నిరంజన్ గారి కాంబినేషన్‌లో వస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా జూన్ 25న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు. హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. హనుమాన్ 3D చూసిన తర్వాత మళ్లీ గూస్‌బంప్స్ వచ్చాయి. ఈ వెర్షన్‌ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఒక రీయూనియన్‌లా అనిపిస్తోందన్నారు.

