Site icon NTV Telugu

PrabhasHanu : హను రాఘవపూడి – ‘రెబల్ స్టార్’ టైటిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

Prabhs Hanu

Prabhs Hanu

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1930ల కాలంలో స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం  నాటి కథా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, యలమంచలి రవి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి అనే డెబ్యూ భామ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా

కాగా ఈ గురువారం రెబల్ స్టార్ బర్త్ డే వస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రేట్ ఇచ్చేందుకు రెడీ అయింది టీమ్. ప్రభాస్ – హను సినిమా టైటిల్ ను రిలీజ్ అధికారకంగా ప్రకటించబోతున్నారు. ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ గత కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ఈ టైటిల్ నే రేపు అధికారంగా ప్రకటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. కొద్దీ సేపటి క్రితం 1932 మోస్ట్ వాంటెడ్ అని ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ను రిఫ్లెక్ట్ చేసేలా ఒక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ బర్త్ డే ట్రీట్ గా ఉదయం 11.07 గంటలకు టైటిల్ పోస్టర్ తో పాటు ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ కు సంబంధించి వర్క్ ను ఎప్పుడో ఫినిష్ చేసారు. భారీ అంచనలపై తెరకెక్కుతున్న ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఓ రెంజ్ లో ఉన్నాయి.

 

 

Exit mobile version