HANU-MAN: ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ మైఖేల్ పోస్టర్ ఆవిష్కరించిన రానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా, మ్యాన్ ఆఫ్ డూమ్ మైఖేల్ గా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన పోస్టర్ ను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్ భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన సైన్యంతో ఫ్లైయింగ్ సాసర్స్ ని తలపించే రోబోటిక్ బ్యాట్స్ నిఘాలో ఒక గుడి ముందు నడుస్తూ రావడం ఈ పోస్టర్ లో ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్, పైరేట్ ఐ ప్యాచ్ తో ఈవిల్ మ్యాన్ లా కనిపించిన వినయ్ రాయ్ తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
బాట్‌మ్యాన్‌కు జోకర్, సూపర్‌మ్యాన్ కు లెక్స్ లూథర్ లాగా హను-మాన్ కు మైఖేల్ సూపర్‌విలన్. ఐతే మైఖేల్ అందరిలాంటి సూపర్ విలన్ కాదు. మైఖేల్ పాత్రకు గొప్ప క్యారెక్టర్ ఆర్క్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్లు ఉన్నతమైన టెక్నాలజీ అతని సొంతం. అతను ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. బిగ్ స్టార్స్, టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వెంకట్ కుమార్ జెట్టి లైన్ ప్రొడ్యూసర్, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నలుగురు ట్యాలెంటెడ్ సంగీత దర్శకులు – అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూస్తున్నారు.
Every kid aspires to be a Superhero. But only a Mad man will pursue it.
Presenting,
the 'Man of Doom' MICHAEL🦹🏻♂️ aka @VinayRai1809 from #HanuMan 💥A @PrasanthVarma Film🎬#SuperHeroHanuMan@tejasajja123 @Actor_Amritha @varusarath5 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/EWTUIaYjSe
— Rana Daggubati (@RanaDaggubati) June 8, 2022
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?