Site icon NTV Telugu

Prasanth Varma : ప్రశాంత్ వర్మ మెడపై అడ్వాన్స్’ల కత్తి?

Prasanth Varma

Prasanth Varma

హ‌నుమాన్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ఇప్పుడు నిర్మాత‌ల నుండి ఊహించ‌ని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘హ‌నుమాన్’ వంటి అతి తక్కువ బ‌డ్జెట్‌లో, అత్యంత నాణ్యమైన అవుట్‌పుట్‌ని ఇచ్చి పాన్ ఇండియా విజ‌యాన్ని అందుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆయన ప్రాజెక్ట్ అంటే చాలు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క వేసేలా ఉంది పరిస్థితి. హనుమాన్ హిట్ అనంతరం ఆయ‌న చేతిలో లెక్క‌లేన‌న్ని ప్రాజెక్టులు లైనప్ అవడంతో వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ప్ర‌భాస్, రిష‌బ్ శెట్టి లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు, దాదాపు 10 సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. మరో ఐదారేళ్ల పాటు కొత్త సినిమా ఒప్పుకోలేని విధంగా ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు.

Also Read :Champion : ‘ఛాంపియన్’ టీజర్..ఇదేదో గట్టిగా కొట్టేట్టు ఉందే!

అయితే ఆ స్పీడ్ ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. హనుమాన్ తరువాత నా సినిమా ‘మీతోనే’ అనే ష‌ర‌తుపై ప్ర‌శాంత్ వ‌ర్మ చాలా మంది నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సులు తీసుకున్నారని అంటున్నారు. ఇండస్ట్రీ టాక్. నిరంజ‌న్ రెడ్డి, సుధాక‌ర్ చెరుకూరి, డి.వి.వి.దాన‌య్య‌, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, హంబ‌లే ఫిల్మ్స్‌ వంటి పేరున్న సంస్థలతో పాటు, కొత్త నిర్మాత‌లు కూడా ఆయన్ని నమ్మి కోరినంత అడ్వాన్సులు ఇచ్చారని, ఈ అడ్వాన్సులు అన్నీ క‌లుపుకొంటే దాదాపు రూ.100 కోట్ల వ‌రకూ ఉంటాయని అంచనా అనే ప్రచారం మొదలైంది. ఇంతమందికి ఒకేసారి సినిమా చేయ‌డం అసాధ్యం కాబట్టి, ప్ర‌శాంత్ వ‌ర్మ నిర్మాత‌ల‌కు “నేను ద‌ర్శ‌క‌త్వం చేయ‌ను కానీ, క‌థ ఇస్తాను. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తాను” అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ తో రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : Srikakulam: తొక్కిసలాట ఆలయం కథ..! తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని ఏకంగా గుడి నిర్మించిన భక్తుడు..

అయితే, నిర్మాత‌లు మాత్రం ఈ ఆప్షన్‌కి సుముఖంగా లేరు. వాళ్లంతా “చేస్తే ప్ర‌శాంత్ వ‌ర్మ‌నే డైరెక్ట్ చేయాలి, లేదంటే అడ్వాన్సులు వెన‌క్కి ఇవ్వాలి” అని డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారని అంటున్నారు. అయితే అడ్వాన్సుల రూపంలో వచ్చిన ఆ డ‌బ్బునంతా వ‌ర్మ తాను కొత్త‌గా నిర్మించిన స్టూడియోపై పెట్టుబ‌డి పెట్టారని, ‘హనుమాన్’ విజయం సాధించిన వెంటనే, హైద‌రాబాద్లో స్థ‌లం కొని, ఖ‌రీదైన ఆఫీస్ నిర్మించారని అంటున్నారు. ఆయన వెనక్కి ఇవ్వడం అయ్యేపని కాదు కాబట్టి నిర్మాత‌లు మూకుమ్మడిగా ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై ఛాంబ‌ర్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న‌ట్లు చెబుతున్నారు.ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది .

Exit mobile version